మన ఆరోగ్యం మన చేతుల్లో 1




కొన్ని వాస్తవాలు :   మనలో చాలా మంది ...

1 . రోజూ తగినన్ని నీళ్లు తాగడం లేదు . మనకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో సగానికి పైగా ఈ కారణం తో  మొదలయ్యేవే. పెద్ద వారు రోజుకు నాలుగు లీటర్ల నీరు తాగాలి .

2 . తీసుకోవలసిందానికంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకొంటున్నాము . స్థూల కాయం మొదలుకుని అనేక సమస్యలకు ఇది కారణం .  పిండిపదార్తాలు తగ్గించి తక్కువ క్యాలరీల ఫుడ్ అంటే పుచ్చ కాయ లాంటి వాటితో సగం కడుపు నింపాలి . బరువు తగ్గడం లో ఇది తోలి మెట్టు .

3 . ప్రోటీన్ లోపం తో బాధపడుతున్నాము . రోజుకు కనీసం నలభై గ్రాముల ప్రోటీన్ తీసుకోవలసి ఉంటే అధిక సంఖ్యాకులు 5 - 10  గ్రాములు కూడా తీసుకోవడం లేదు . కడుపు నిండా కార్బోహైడ్రేట్స్ నింపుతున్నారు . సొయా , పుట్ట గొడుగులు , డ్రై ఫ్రూప్ట్స్ , చికెన్ , ఫిష్ లో ఎక్కువ ప్రోటీన్ లు దొరుకుతాయి .

4 . తీసుకోవలసిందానికంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉప్పు తీసుకొంటున్నాము . దీని వల్ల బీపీ గుండె జబ్బులు మాత్రమే కాకుండా కీళ్ల నొప్పులు వస్తాయి . ఉప్పు నింపి న గిన్నె ను చూడండి. ఆ గిన్నె లాగే మన శరీరం కూడా అధిక ఉప్పు వల్ల నాశనం అవుతుంది .

5 . జంక్ ఫుడ్ బాధితులే .  కోక్ అంటే విషం .  కెమికల్స్ కలిసిన ఏ ప్రొసెస్డ్ . పాకెజెడ్ ఫుడ్ అయినా విషమే . నాచురల్ ఫుడ్ తీసుకోవాలి .

6 . రోటీ బాధితులే . అన్నం మంచిది కాదు .. రోటీ తినండి అని శంకర్ దాదా డాక్టర్స్ చెప్పడాన్ని పట్టుకొని నాన్ . రోటి . పూరి , పరోటా లాంటివి తెగ తినేస్తారు . వీటిలో చాల మటుకు పూర్తి స్థాయి మైదా తో లేదా సగం మైదా కలిపి చేసినవే . మైదా అంటే తెల్లటి విషం.

7 . సోమరి తనానికి బానిసలం . రోజులో అధిక గంటలు కూర్చొని లేదా పడుకొని గడిపేస్తాం . మానవ పరిణామ క్రమం లో మనిషి  శరీరం ఎక్కువ గంటలు నిలబడానికి , నడవడానికి , పరుగెత్తడానికి , పని చెయ్యడానికి అనుగుణం గా రూపుదిద్దకుంది . కూర్చొని గడపడం అంటే రామ్మా రా అంటూ మరణాన్ని త్వరగా ఆహ్వానించడమే .

Comments

Popular Posts